Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:29 PM

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి

28-08-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హస్సేన్‌ డిమాండ్‌

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సూర్యాపేట జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్‌ డిమాండ్‌ చేశారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌ సమీపంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 15వ రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్‌రెడ్డి తదితర నాయకులు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన తల్లమల్ల హస్సేన్‌ వారికి శుభాకాంక్షలు తెలిపి సంఘీభావం ప్రకటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల హక్కు అని అన్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరడంతోపాటు రైల్వే శాఖకు కూడా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.

సూర్యాపేట ప్రజలు తమ హక్కుల సాధన కోసం పోరాట చరిత్ర కలిగిన గొప్ప యోధులని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకమై గత 40 నెలలుగా శాంతియుతంగా బుల్లెట్‌ ట్రైన్‌ సాధన కోసం పోరాడుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు.

కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం గతంలో ప్రతిపాదించిన బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ను మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టి, భవిష్యత్‌ తరాల ప్రయోజనాల కోసం సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News