Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

రాఖీ కట్టిన సహచారీలు.. భరోసా ఇచ్చిన సీఐ సైదులు

27-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి:

మహిళల భద్రత, గౌరవం కోసం పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని చైతన్యపురి సీఐ సైదులు తెలిపారు. రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కొత్తపేట్‌ మహిళా భవన్‌లో సహచారీలతో రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు.

చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ సహచారీలతో కలిసి రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన రక్షాబంధన్‌ సందేశాన్ని చదివి వినిపించారు.

మహిళల పట్ల గౌరవం, భద్రత, ఆత్మీయత, పరస్పర నమ్మకాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంపై సహచారీలు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

రాఖీ కట్టిన సహచారీలు.. భరోసా ఇచ్చిన సీఐ సైదులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News