Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:09 AM

ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా

ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా

ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా
28-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఆగస్టు 27: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీ ఈజేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట గురువారం మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్లు, క్లాస్‌–4 ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా టీజీ ఈజేఏసీ చైర్మన్‌ నాగిళ్ల మురళి, కన్వీనర్‌ బి.యాదయ్య మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం ఇకపై ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ అమలు, ఆరు డీఏలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు, హెల్త్‌ కార్డుల మంజూరు తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిర్వహించిన మహాధర్నాకు వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, గురుకుల ఉపాధ్యాయుల జేఏసీ, డీఆర్‌డీఏ, పోలీస్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, భిక్షం, వెంకటేష్‌, అంజిరెడ్డి, శ్రీనివాస్‌, రమేశ్‌, రాంబాబు, యాకూబ్‌నాయక్‌, యాదగిరి, జయరావు, జమీరుద్దీన్‌, జి.వెంకటరెడ్డి, మనోజ్‌, ప్రదీప్‌, రాములు, సత్యనారాయణ, శక్తీష్‌చంద్ర, జనార్దన్‌, పి.వెంకటేశం, హలీం, కాసీం, భిక్షపతి, సోమేశ్‌కుమార్‌, విద్యాసాగర్‌, కరుణగౌడ్‌, నరేశ్‌, రమ్యసుధ, సుమలత, సతీష్‌, మధు, లక్ష్మి, సునీత, షఫీ తదితరులు పాల్గొన్నారు.

మహాధర్నాను విజయవంతం చేసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులకు టీజీ ఈజేఏసీ నాయకులు నాగిళ్ల మురళి, బి.యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News