Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం
30-08-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కుమ్మరులు సంఘటితంగా ముందుకు సాగాలి: తాడూరు చంద్రం.

చిన్నకాపర్తి:

శ్రావణ మాసం సందర్భంగా చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.కార్యక్రమానికి కుమ్మర సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ తాడూరు చంద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోనాల సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.స్థానిక సర్పంచ్‌ ఆవుల సుందర్ కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ గంగాపురం భాస్కర్, వార్డు సభ్యులు, కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు పాకల దినేష్, ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీను, ఆరూరి నరసింహ, చిన్నకాపర్తి, పాకాల గ్రామాలకు చెందిన కుమ్మర వంశస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News