Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి....

31-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రాబోయే శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక గుర్తింపు లభించాలని, ఈ దిశగా మార్పు కోదాడ నుంచే ప్రారంభం కావాలని కేజీ టు పీజీ తెలంగాణ గుర్తింపు పొందిన విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్రం - ఉద్యమ ఆకాంక్షలు అనే అంశంపై మేధావులు, కళాశాల యాజమాన్యాలు, పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గింజల రమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ పడుతున్న ఉస్మానియా జేఏసీ నాయకుడు, విద్యావంతుడు, గిరిజన బిడ్డ డాక్టర్ బట్టు శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సామాన్య, బహుజన కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. బహుజన, గిరిజన అభ్యర్థి అయిన ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, విద్యావంతులు, ఉద్యోగులు, పట్టభద్రులు శ్రీహరికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బట్టు శ్రీహరి, పందిరి నాగిరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, రాయపూడి చిన్ని, పిల్లుట్ల శ్రీను, జహీర్, బట్టు శివాజీ, గుండె పంగు రమేష్, పంది కళ్యాణ్, కొండ సైదయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.......

Sthanikam

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలి....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News