Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు

11-07-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో చౌటకూరు, పుల్కల్, జోగిపేట మున్సిపాలిటీ, ఆందోల్, అల్లదుర్గ్, వట్పల్లి మండలాల్లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జూలై 24లోపు పూర్తిచేయాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా నింపడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని, బూత్‌ల వారీగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకుని అలసత్వం లేకుండా పనిచేయాలని బీఎల్‌ఏలకు సూచించారు. అలాగే బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌ఓలు) సమన్వయం చేసుకుంటూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఆందోల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డా. రాజీవ్, జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, చిట్టిబాబు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News