Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

ట్రినిటీ హైస్కూల్‌లో ఘనంగా 'ఆరెంజ్ కలర్' సంబరాలు

11-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రంగులపై అవగాహన పెంచుకోవాలి: ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల

నారింజ పండ్లతో 'సి' విటమిన్ పుష్కలం

స్థానిక చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్ ఐఐటీ జోన్ ఆవరణలో శనివారం 'ఆరెంజ్ డే' (నారింజ రంగు) సంబరాలను అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ ఉజ్జిని మంజుల జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ప్రారంభించారు.​ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే విద్యార్థులకు వివిధ రంగులపై ప్రాథమిక అవగాహన కల్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాషాయం (ఆరెంజ్) రంగు యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆరెంజ్ రంగులో ఉండే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తీపి పదార్థాలతో (స్వీట్స్) ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. నారింజ రంగులో ఉండే పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి మేలు చేసే 'సి' విటమిన్ పుష్కలంగా లభిస్తుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు.​ఈ సంబరాలలో ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ఐఐటీ జోన్ ఇంచార్జ్ అనుష, కోఆర్డినేటర్ చందన, ఉపాధ్యాయులు శిరీష, హారిక, రత్న, భార్గవి, సింధు, లావణ్య, రేణుక, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ట్రినిటీ హైస్కూల్‌లో ఘనంగా 'ఆరెంజ్ కలర్' సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News