Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక

11-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఏలే సుధాకర్ చైర్మన్‌గా,గర్దాస్ చంద్రమౌళి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.సంఘం పాలకవర్గ సభ్యులుగా అందే రాములు,తిరందాస్ దానయ్య,ఎలగందుల హరినాథ్,గర్దాస్ లలిత,గర్దాస్ మణెమ్మ ఎన్నికయ్యారు.

ఎన్నికల అనంతరం చేనేత జిల్లా కార్యాలయంలో నూతన చైర్మన్ ఏలే సుధాకర్ పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత 18 సంవత్సరాల తర్వాత సంఘానికి చారిత్రాత్మకంగా ఎన్నికలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.సంఘం సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ,వారి ఆశయాలకు అనుగుణంగా చేనేత సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అందే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి అర్హ సభ్యునికి పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.ఇంకా సభ్యత్వం లేని అర్హులందరికీ సభ్యత్వాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘ సభ్యుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి,వారితో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటూ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News