Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

10-07-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే సహించేది లేదు

రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం ఇచ్చిన విద్యాసంస్థల బంద్ చౌటుప్పల్ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు ఆసరా ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

​ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులపై భారం మోపే జీవో నెం. 7, 8, 9లను ఉపసంహరించుకోవాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు,

తల్లిదండ్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఎరిగి వరుణ్ తేజ్, మండల నాయకులు మల్లేష్, మణికంఠ, సిద్దు, బన్నీ, జయంత్, అభి, మోసిన్, నవదీప్, నరసింహ, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మండలంలో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News