Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:31 PM

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

10-07-2026 230 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 10: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన రైతు నాలుగోని లింగస్వామికి చెందిన పాడి గేదె గురువారం విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు.

స్థానికుల వివరాల ప్రకారం, మేత కోసం వెళ్లిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహిస్తున్న తీగలను తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు లింగస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు.

గ్రామస్తులు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత రైతుకు ప్రభుత్వం, సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

పాడి గేదె మృతితో రైతు లింగస్వామికి తీరని నష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News