Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:32 AM

మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన

04-07-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయిజిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్‌లు మహిళలు, చిన్నారుల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, విద్యార్థులు మరియు ప్రజలకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందికి శక్తి యాప్ ప్రత్యేకతలు, వినియోగ విధానం, అత్యవసర పరిస్థితుల్లో పొందగలిగే సహాయ సేవల గురించి వివరించారు. అలాగే విద్యార్థులకు మహిళలు మరియు చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, మైనర్ ప్రేమ వ్యవహారాలు, ఇంటి నుండి పారిపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు సోషల్ మీడియాను అవసరమైన మేరకే ఉపయోగించి విద్యపై దృష్టి సారించాలని, మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే గంజాయి, మద్యం, సిగరెట్లు మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఇవి ఆరోగ్యం, విద్య మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.

భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా నేరాలను ముందుగానే నివారించవచ్చు. ప్రతి మహిళ శక్తి యాప్‌ను వినియోగించుకోవాలి. ప్రతి విద్యార్థి సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు మరియు సామాజిక దుష్ప్రవర్తనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ సమస్య ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను లేదా సంబంధిత హెల్ప్‌లైన్ సేవలను సంప్రదించాలి. ప్రజల భద్రత కోసం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని శక్తి టీం యు బృందాలు తెలియజేశారు.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం:

• 112 – పోలీస్ ఎమర్జెన్సీ సేవలు

• 181 – మహిళల హెల్ప్‌లైన్

• 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్

• 1930 – సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్

• 1091 – మహిళల అత్యవసర సహాయ సేవ

మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను లేదా సంబంధిత హెల్ప్‌లైన్ సేవలను సంప్రదించాలని శక్తి టీమ్ సభ్యులు సూచించారు.

Sthanikam

మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News