Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:20 AM

తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మందుల సామేల్ తోనే సాధ్యం

10-07-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారీకి అండగా ఉంటానని తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ బేధాలు లేకుండా సమన్వయంతో కృషి చేస్తానని అన్నారు. కార్యకర్త అర్థరాత్రి ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా చేస్తానని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మందుల సామేల్ తోనేసాధ్యమవుతుందని అన్నారు. నియోజక వర్గానికి రెండు వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కొందరు నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. గత ప్రభుత్వం లో గాని, 40 సంవత్సరాలు పాలించిన పాలకులు గాని తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయలేదు, మన స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల తో మాట్లాడి తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారని అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేల్ ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారుఅని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని గ్రామాలలో తిరిగి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకున్న ఏకైక వ్యక్తి మందుల సామేలు అని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంలో 21 కోట్ల రూపాయలతో వ్యయంతో సిసి రోడ్లు, బీట్ రోడ్లు ఏర్పాటు చేశారని, అంతేకాకుండా ప్రతి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాలను ఏర్పాటు చేశారని, తుంగతుర్తి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వంలో సగం పనులు ఆపివేయడంతో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తోటి మంత్రుల తోటి మాట్లాడి 100 పడకల ఆస్పత్రిని నిర్మాణ పనులకోసం కృషి చేస్తున్నారని, తిరుమలగిరిలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారని అన్నారు. నిత్యం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సామెల్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలోకి తీసుకువెళ్లి చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మందుల సామేల్ తోనే సాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News