Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!

08-07-2026 209 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భద్రతా లోపాలపై భక్తుల ఆందోళన – లైటింగ్ లేక అంధకారంలో దేవస్థాన ప్రాంగణం.

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాల నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన చోరీ ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయంలోకి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది.

చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో సరైన లైటింగ్ సౌకర్యం లేకపోవడంతో రాత్రివేళ మొత్తం ప్రాంగణం అంధకారంలో మునిగిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చోరీ ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్, నిర్వాహకులు వెంటనే స్పందించి ప్రాంగణంలో హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ఈ దేవస్థానంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఆలయ ప్రాంగణంలో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇకనైనా అధికారులు, ఆలయ పాలకవర్గం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News