Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

08-07-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్మన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతిపత్రం

​స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ కి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళాశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛమైన తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలోని తాగునీటి ప్లాంటును వెంటనే పునరుద్ధరించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాగునీటితో పాటు కళాశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలి అన్నారు.​ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు పోలేపల్లి మల్లేష్, జూనియర్ కళాశాల కార్యదర్శి సిద్దు, నాయకులు యశ్వంత్, వంశీ, సాయి, మంజునాథ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News