Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్

08-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం కలకలం రేపింది. శివాజీనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న దందాపై నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చివ్వెంల మండల గర్భిణి మరణం కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి ఇదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో గర్భిణీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించి గర్భస్థ శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Sthanikam

లింగ నిర్ధారణ ముఠాపై పోలీసుల మెరుపుదాడి నకిరేకల్‌లో గుట్టు రట్టు.. ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్ట్

Article Image

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం కలకలం రేపింది. శివాజీనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న దందాపై నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను అదుపులోకి తీసుకున్నారు. గతంలో చివ్వెంల మండల గర్భిణి మరణం కేసులోనూ నిందితులుగా ఉన్న వీరు, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తిరిగి ఇదే అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు సమాచారం.

కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీల సహకారంతో గర్భిణీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులతో సంబంధాలున్న మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నారు. చట్టాన్ని ధిక్కరించి గర్భస్థ శిశువుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News