Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:31 AM

ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి జరిమానా.

07-07-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల ప్రాణాలు, రక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు పుట్టపర్తి అర్బన్ సీఐ యువరాజు తెలిపారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాలతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించిన స్థితిలో వాహనాలు నడుపుతున్న ఒక ఆటో డ్రైవర్, ఒక ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు గుర్తించారు. బ్రెత్ అనలైజర్ పరీక్షలో వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేశారు.

అనంతరం వారిద్దరినీ ఈరోజు మంగళవారం పుట్టపర్తి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరచగా, కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తి ఇద్దరికీ రూ.10,000 చొప్పున మొత్తం రూ.20,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా సీఐ యువరాజు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమే కాకుండా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ , బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని అటువంటి వారిపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు.

Sthanikam

ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి జరిమానా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News