Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

07-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అదే విధంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎల్లంబావికి చెందిన కంకల బీరయ్య, కార్యదర్శిగా ఏపూర్ గ్రామానికి చెందిన కొండె వెంకటేష్, కోశాధికారిగా కాట్రేవుకు చెందిన దిందే ఆడవయ్య బాధ్యతలు చేపట్టనున్నారు.

డైరెక్టర్లుగా గుండ్రాంపల్లికి చెందిన కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ, అంతమ్మగూడెంకు చెందిన వస్పరి జహంగీర్, వేలిమినేడుకు చెందిన కొండె మహేష్, ఎల్లంబావికి చెందిన బాలం జంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్ మాట్లాడుతూ సంఘ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సభ్యుల సంక్షేమం, సంఘ బలోపేతం, ప్రభుత్వ పథకాల సద్వినియోగం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

సంఘం నూతన కార్యవర్గానికి సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో సంఘం మరింత పురోగతి సాధించి సభ్యులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఉన్ని సంఘం పగ్గాలు కాసు గణేష్‌కు ఏకగ్రీవ ఎన్నిక.. నూతన కార్యవర్గానికి సభ్యుల అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News