Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు

06-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఘనంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, హోమాలు

* మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ పాటిమీద భక్తాంజనేయ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాల సప్తమి వార్షికోత్సవ వేడుకలు సోమవారం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్మాణ దాతలు సోమవారం వెంకటమ్మ సత్తయ్య దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. దాతల చేతుల మీదుగా స్వామివార్లకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు,రుద్రహోమము, ప్రత్యేక అభిషేకాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.​ఈ వేడుకల్లో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ సందగళ్ళ నాగరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భక్తాంజనేయ, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సప్తమి వార్షికోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News