Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:31 AM

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి

06-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రాలయం: డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం మంత్రాలయం పట్టణంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు కుడి కన్ను అయితే, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ ఎడమ కన్నులాంటి నాయకుడని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానేతగా ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విశేష కృషి చేశారని అన్నారు.ఆయన ఆశయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో దళిత, గిరిజనుల రాజకీయ భాగస్వామ్యం, ప్రతినిధిత్వం పెరగాల్సిన అవసరంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్‌కుమార్, మారెన్న, నాగేంద్ర, టౌన్ అధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షుడు గాడిమోడీ నరసింహులు, మండల అధికార ప్రతినిధి ఏసేపు, మండల కార్యదర్శి గర్జి ప్రకాష్, కల్లుదేవకుంట గ్రామ అధ్యక్షుడు ప్రభుదాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News