Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

వానదేవుడి కరుణ కోసం గాడిదల పెళ్లి

వానదేవుడి కరుణ కోసం గాడిదల పెళ్లి

వానదేవుడి కరుణ కోసం గాడిదల పెళ్లి
06-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వర్షాభావంతో గ్రామస్తుల వినూత్న ప్రార్థన.. శాస్తోక్తంగా వివాహం, విందు భోజనాలతో సందడి

బెళగావి, జూలై 6:

వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్న వేళ, వానదేవుడి కరుణ కోసం గ్రామస్తులు సంప్రదాయ విశ్వాసాలకు ఆశ్రయించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మున్యాళ గ్రామంలో గాడిదలకు ఘనంగా వివాహం జరిపించి వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామస్తులు మగ గాడిదకు ‘కాంతేశ్’, ఆడ గాడిదకు ‘కస్తూరి’ అని పేర్లు పెట్టి, పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించారు. వివాహ వేడుకకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి అనంతరం అతిథుల కోసం ప్రత్యేకంగా విందు భోజనాలు ఏర్పాటు చేయడం విశేషం. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం గాడిదలకు వివాహం జరిపిస్తే మంచి వర్షాలు కురుస్తాయని విశ్వాసం ఉందని తెలిపారు.వర్షాభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు ప్రకృతి అనుకూలించాలని ప్రార్థిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రామీణ సంప్రదాయాలు, విశ్వాసాలకు నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Sthanikam

వానదేవుడి కరుణ కోసం గాడిదల పెళ్లి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News