Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద

Updated : 06 Jul 2026 16:33 IST
As Preferred Source 1 min read
ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని బోర్గి గ్రామంలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల సబ్సిడీ టైలరింగ్ శిక్షణను పూర్తి చేసిన 30 మంది మహిళలకు సోమవారం మండల కోఆర్డినేటర్ అల్లూరి మహానంద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి స్వయం ఉపాధితో ముందుకు సాగాలనే లక్ష్యంతో గ్రామ స్వరాజ్ సంస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ఎప్పుడూ అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, శిక్షణ పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Sthanikam

ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం: అల్లూరి మహానంద

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని బోర్గి గ్రామంలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో 30 రోజుల సబ్సిడీ టైలరింగ్ శిక్షణను పూర్తి చేసిన 30 మంది మహిళలకు సోమవారం మండల కోఆర్డినేటర్ అల్లూరి మహానంద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి స్వయం ఉపాధితో ముందుకు సాగాలనే లక్ష్యంతో గ్రామ స్వరాజ్ సంస్థ ద్వారా ప్రతి గ్రామంలో ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ఎప్పుడూ అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, శిక్షణ పొందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news