Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:15 PM

దివ్యాంగుల డిమాండ్లపై సర్కార్‌ స్పందించాలి..!

06-07-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హామీలు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

దివ్యాంగ వేదన దీక్షలో వక్తల హెచ్చరిక

హైదరాబాద్, జూలై 6 దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దివ్యాంగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ వేదన దీక్షలో పలువురు వక్తలు మాట్లాడారు.

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. భారీ బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన వాటినీ పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

దీక్షలో సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, రాష్ట్ర ఇన్‌చార్జ్ కె.వి. గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కటకం నర్సింగరావు, కాసం సత్యనారాయణ, రమేష్, జయలక్ష్మి, ధనలక్ష్మి, బాలలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల డిమాండ్లపై సర్కార్‌ స్పందించాలి..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News