Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:21 PM

వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్‌కు వికలాంగుల సంఘం వినతి

06-07-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్,

వెన్నుపూస కండరాల క్షీణిత (Spinal Muscular Atrophy)తో బాధపడుతున్న వికలాంగులకు నెలకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దేవిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు నెలకు రూ.4 వేల పింఛన్ మాత్రమే అందుతోందని తెలిపారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనవరిలో మరోసారి జీవో వచ్చినా ఇప్పటికీ పింఛన్ పెంపు అమలులోకి రాలేదన్నారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు అధిక పింఛన్ అందుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, అర్హులైన పలువురు వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పింఛన్ కూడా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను అమలు చేసి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, సభ్యులు దుబ్బ వెంకన్న, నేడు పరమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలి. కలెక్టర్‌కు వికలాంగుల సంఘం వినతి

Article Image

నల్గొండ టౌన్,

వెన్నుపూస కండరాల క్షీణిత (Spinal Muscular Atrophy)తో బాధపడుతున్న వికలాంగులకు నెలకు రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దేవిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు నెలకు రూ.4 వేల పింఛన్ మాత్రమే అందుతోందని తెలిపారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు రూ.15 వేల పింఛన్ ఇవ్వాలని జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనవరిలో మరోసారి జీవో వచ్చినా ఇప్పటికీ పింఛన్ పెంపు అమలులోకి రాలేదన్నారు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వెన్నుపూస కండరాల క్షీణిత వికలాంగులకు అధిక పింఛన్ అందుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, అర్హులైన పలువురు వికలాంగులకు ప్రస్తుతం రూ.4 వేల పింఛన్ కూడా అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను అమలు చేసి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, సభ్యులు దుబ్బ వెంకన్న, నేడు పరమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News