Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:18 PM

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.

06-07-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపురం: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండలంలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ గాయత్రి పాఠశాలలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు మనిషి మనుగడకు ఆధారమని, ప్రాణవాయువు, స్వచ్ఛమైన వాతావరణం, నీడ, వర్షపాతం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయని చెప్పారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, వారు మొక్కలను సంరక్షించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి మొక్కలకు నీరు పోశారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి, తాము నాటిన మొక్కలను చెట్లుగా పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్రకృష్ణ, పాఠశాల ఇన్‌చార్జి ఆనంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పచ్చని భవిష్యత్తుకు మొక్కలే పునాది: చినుకని యువరాజు.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News