Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

06-07-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్

​* చౌటుప్పల్‌లో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి రిపోర్టును తెప్పించుకొని, వెంటనే నూతన వేతన సవరణను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటికాల రవీందర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.​ ముఖ్య అతిథిగా హాజరైన ఇటికాల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత విద్యాభ్యాసం (హైయర్ ఎడ్యుకేషన్) చేయడానికి సంబంధించిన జీవో 342 అమలుకు అడ్డంకిగా మారిన మెమో నెంబర్ 26659ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా, ఉపాధ్యాయుల పదోన్నతులలో ఆటంకంగా ఉన్న ‘ఆడక్వసీ’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.​ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య, చౌటుప్పల్ మండల అధ్యక్షులు జనపాల కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భార్గవి, ఎస్. దుర్గయ్య, మేడి యాదయ్య, కే. మహేశ్వరి, జి. యశోద, ఈ. శ్వేత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

పిఆర్‌సిని వెంటనే ప్రకటించాలి: ఇటికాల రవీందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News