Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

జర్నలిస్టుల పిల్లలకు 75 శాతం ఫీజు రాయితీ కల్పించాలి.కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ధర్నా

06-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, జూలై 6:

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 75 శాతం ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గాలపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల కారణంగా జర్నలిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక కొందరు జర్నలిస్టుల పిల్లలు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై గతంలో జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అమలు చేసేలా సర్క్యులర్లు జారీ చేసిన నేపథ్యంలో, నల్లగొండ జిల్లాలోనూ వెంటనే 75 శాతం ఫీజు రాయితీ అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదారి యాదగిరి, అశ్వక్ అహ్మద్, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మదనాచారి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేష్, వీడియో గ్రాఫర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే సలీం, జర్నలిస్టులు పిట్టల రామకృష్ణ, ఎండి సయ్యద్, జిల్లా యాదయ్య, ఊర రమేష్, గుడిపాటి శ్రీనివాస్, సందీప్, సోమశేఖర్, అశోక్ కుమార్, డి.ఎస్. యాదవ్, బందేల స్వామి, బజరంగ్, ఖుద్దూస్, ఎండి షరీఫ్, ఎండి ఆసిఫ్, దోటి శ్రీనివాస్, చింత యాదయ్య, యాదగిరి, కొండ స్వామి, రాంప్రసాద్, తరకొప్పుల శంకర్, ఎండి జుబేర్, బోగారి రామకృష్ణ, అబ్దుల్ రహీం, దేవరాపల్లి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల పిల్లలకు 75 శాతం ఫీజు రాయితీ కల్పించాలి.కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News