Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:37 AM

కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం

24-06-2026 277 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న యలమర్తి మారెన్న కుమారుడు యలమర్తి మధు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 966 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించడంతో మధును (స్టార్ బ్యాచ్ ప్రోగ్రాం) తారా బృంద కార్యక్రమానికి ఎంపిక చేశారు. అంతేకాకుండా ప్రముఖ విఐటి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి ఉచితంగా చదువుకునే ప్రవేశం లభించింది. ఈ అరుదైన విజయం సాధించిన యలమర్తి మధును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంజనీరింగ్ చదువుకు ఉపయోగపడేలా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రాన్ని కలెక్టర్ స్వయంగా అందజేశారు. మధు సాధించిన ఘనత పట్ల బేడ బుడగ జంగం సామాజిక వర్గం, అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిశాల అంజి కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి, పట్టు వస్త్రంతో సత్కరించారు.అనంతరం మధు తన కళాశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులను కలిసి మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. ఉపాధ్యాయులు కూడా మధును పట్టు వస్త్రంతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దీవించారు.

Sthanikam

కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న యలమర్తి మారెన్న కుమారుడు యలమర్తి మధు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 966 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించడంతో మధును (స్టార్ బ్యాచ్ ప్రోగ్రాం) తారా బృంద కార్యక్రమానికి ఎంపిక చేశారు. అంతేకాకుండా ప్రముఖ విఐటి ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తి ఉచితంగా చదువుకునే ప్రవేశం లభించింది. ఈ అరుదైన విజయం సాధించిన యలమర్తి మధును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంజనీరింగ్ చదువుకు ఉపయోగపడేలా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రాన్ని కలెక్టర్ స్వయంగా అందజేశారు. మధు సాధించిన ఘనత పట్ల బేడ బుడగ జంగం సామాజిక వర్గం, అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కార్యదర్శి సిరిశాల అంజి కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి, పట్టు వస్త్రంతో సత్కరించారు.అనంతరం మధు తన కళాశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులను కలిసి మిఠాయిలు పంచిపెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. ఉపాధ్యాయులు కూడా మధును పట్టు వస్త్రంతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దీవించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News