Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్

12-06-2026 309 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* బాధితులకు 50 కిలోల బియ్యం పంపిణీ

* తోడుగా ఉంటామని భరోసా

ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యతని చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామ 3వ వార్డు సభ్యులు దోర్నాల శ్రీనివాస్ అన్నారు. చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప క్రాంతి కుటుంబం ఇటీవల తీవ్ర ఇబ్బందుల్లో పడటంతో విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గురువారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.​ఆ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తానున్నానంటూ కొండంత భరోసా కల్పించారు. అనంతరం వారి తక్షణ కుటుంబ అవసరాల నిమిత్తం తన సొంత ఖర్చులతో 50 కిలోల బియ్యాన్ని బాధితులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా స్పందించి అండగా నిలవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉంటూ సేవ చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.ఈ మానవతా దృక్పథ కార్యక్రమాల్లో ఐవైసీ (IYC) మండల వైస్ ప్రెసిడెంట్ నెల్లే గణేష్, 1వ వార్డు సభ్యుడు బక్క భిక్షం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బక్క నరసింహ, డొప్ప భిక్షపతి, ఊదరి రమేష్, బక్క స్వామి, నత్తి వెంకటేష్, పాపగల మహేష్, నత్తి కిరణ్, డొప్ప కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News