Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!
11-06-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో వినియోగదారుల అవస్థలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారింది. నిత్యం వందలాది మంది వచ్చే ఈ బంక్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో నిత్యం ప్రయాణించే దాదాపు 250 మందికి పైగా మహిళలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు.

​ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు ఉచితంగా గాలి కొట్టాల్సి ఉండగా.. ఇక్కడి యాజమాన్యం ఉచిత పంపును పక్కనబెట్టి, ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి వాహనదారుల నుండి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. నియమ నిబంధనలు గాలికొదిలేసిన ఈ బంక్ యాజమాన్యంపై యాదాద్రి భువనగిరి జిల్లా పౌర సరఫరాల అధికారి (CSO) తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం చౌటుప్పల్ అధ్యక్షులు పేరేపల్లి స్వామి గౌడ్, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

సౌకర్యాలు శూన్యం.. వసూళ్లు ఘనం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News