Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:47 AM

"ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు" నినాదంతో ఇంటింటి ప్రచారం.

11-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు,

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ, ‘‘ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు’’ అనే నినాదంతో ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని మంచి ఉద్యోగాలు సాధించి సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రభుత్వ బడుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్, వార్డు సభ్యులు జనగాం మంగమ్మ–సత్యనారాయణ, జినకల నాగమణి–జంగయ్య, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేడి ఎల్లమ్మ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు చంద్రకళ, విజయలక్ష్మి, వనజ, అనూష, స్వాధిద, జ్యోతి, రజిత, శిరీష, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

"ప్రైవేట్ పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాల ముద్దు" నినాదంతో ఇంటింటి ప్రచారం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News