Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

పోలీస్ ఉద్యోగాల భర్తీకి డీవైఎఫ్‌ఐ సంతకాల ఉద్యమం. 19 వేల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.డీవైఎఫ్‌ఐ

11-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోందన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్న వేలాది మంది యువతీ, యువకులు నియామకాల జాప్యం కారణంగా వయోపరిమితి దాటిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని, అభ్యర్థులకు వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచాలని, లాంగ్ జంప్ అర్హతను 3.8 మీటర్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.

సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, నాయకులు మాదాసు రావణ్, బొమ్మనబోయిన రాజు, కొంగల ప్రసాద్, మల్లం రోహిత్, అదిమల్లా భగత్, శ్రీకాంత్, శివ, అనిల్, రాము, అశోక్, హరీష్, ప్రశాంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ ఉద్యోగాల భర్తీకి డీవైఎఫ్‌ఐ సంతకాల ఉద్యమం. 19 వేల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News