Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:33 PM

భూగేని చెరువుకు కొత్త సొబగులు. రూ.48 లక్షల అభివృద్ధి పనుల పరిశీలన కోసిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎన్. రాకేష్ రెడ్డి

10-06-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోసిగి,

మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి పట్టణం 3, 4 వార్డుల పరిధిలో ఉన్న భూగేని చెరువు ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తనయుడు, యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి పరిశీలించారు.

ఇటీవల రూ.48 లక్షల వ్యయంతో ప్రారంభమైన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, బెంచీలు, సోలార్ లైట్లు, చిన్నారుల పార్కు, ఆట వస్తువులు, ఆకర్షణీయ ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కోసిగి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూగేని చెరువు ప్రాంతాన్ని పట్టణ ప్రజలకు ప్రత్యేక విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్శనలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

భూగేని చెరువుకు కొత్త సొబగులు. రూ.48 లక్షల అభివృద్ధి పనుల పరిశీలన కోసిగి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: ఎన్. రాకేష్ రెడ్డి

Article Image

కోసిగి,

మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి పట్టణం 3, 4 వార్డుల పరిధిలో ఉన్న భూగేని చెరువు ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తనయుడు, యువ నాయకుడు ఎన్. రాకేష్ రెడ్డి పరిశీలించారు.

ఇటీవల రూ.48 లక్షల వ్యయంతో ప్రారంభమైన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్, బెంచీలు, సోలార్ లైట్లు, చిన్నారుల పార్కు, ఆట వస్తువులు, ఆకర్షణీయ ఆర్చ్ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కోసిగి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూగేని చెరువు ప్రాంతాన్ని పట్టణ ప్రజలకు ప్రత్యేక విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్శనలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News