Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి.

10-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా, అందులోని అనేక కీలక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి చట్టం అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన నివాసంలో దివ్యాంగుల విశ్వవిద్యాలయాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్‌తో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రూపొందించిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాల పుస్తకాన్ని పరిశీలించి, అందులోని అంశాలను అధ్యయనం చేశారు.

దివ్యాంగుల విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చట్టం అమలు జరగకపోవడం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ అశోక్ వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ, దివ్యాంగుల హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో గళం వినిపించడంతో పాటు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ తాటిపాముల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా. భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి.

Article Image

హైదరాబాద్,

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా, అందులోని అనేక కీలక అంశాలు ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భువనగిరి ఎంపీ దామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి చట్టం అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన నివాసంలో దివ్యాంగుల విశ్వవిద్యాలయాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్‌తో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రూపొందించిన 2016 దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాల పుస్తకాన్ని పరిశీలించి, అందులోని అంశాలను అధ్యయనం చేశారు.

దివ్యాంగుల విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చట్టం అమలు జరగకపోవడం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ అశోక్ వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ, దివ్యాంగుల హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో గళం వినిపించడంతో పాటు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ తాటిపాముల శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News