Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శనం

10-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రతిభకు పట్టాభిషేకం” కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి సరైన మార్గదర్శకత్వం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. యువత భవిష్యత్తు నిర్మాణంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్,మైతబ్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్సై శ్రీశైలం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News