Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:32 AM

హైదరాబాద్‌లో బొగ్గు గ్యాసిఫికేషన్ రోడ్‌షో. పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలకు కేంద్రం భారీ కసరత్తు

10-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్‌ 11న హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనుంది. ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన రోడ్‌షోకు పరిశ్రమల నుంచి లభించిన విశేష స్పందనతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా, కేంద్ర సహాయ మంత్రి సతీష్‌ చంద్ర దూబే గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్‌ దేవ్‌ దత్‌, అదనపు కార్యదర్శి సనోజ్‌ కుమార్‌ ఝాతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, బొగ్గు–లిగ్నైట్ సంస్థల అధికారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు.

ఇంధన రంగంలో కీలక అడుగు

బొగ్గును ‘సిన్‌గ్యాస్‌’గా మారుస్తూ మిథనాల్‌, అమ్మోనియం నైట్రేట్‌, సింథటిక్‌ సహజవాయువు, ఇతర పారిశ్రామిక రసాయనాల తయారీకి వినియోగించే గ్యాసిఫికేషన్ సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. దేశీయ బొగ్గు వనరుల వినియోగాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

పరిశ్రమలకు అవకాశాల వేదిక

విధానపరమైన మద్దతు, సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడి అవకాశాలు, ప్రాజెక్టుల అమలు వ్యూహాలపై చర్చించేందుకు ఈ రోడ్‌షో వేదిక కానుంది. దేశవ్యాప్తంగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించే అవకాశం కల్పించనుంది.

ఆత్మనిర్భర్ భారత్‌కు బలం.

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో బలమైన వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ఆవిష్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇంధన భద్రత, వనరుల సమర్థ వినియోగం, పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటునందించడమే లక్ష్యమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమం ఆత్మనిర్భర్ భారత్‌ లక్ష్య సాధనకు మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Sthanikam

హైదరాబాద్‌లో బొగ్గు గ్యాసిఫికేషన్ రోడ్‌షో. పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలకు కేంద్రం భారీ కసరత్తు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News