Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:25 PM

మిలిగిరిపేట వాగు ప్రాంతంలో మొసలి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

08-06-2026 437 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలం మిలిగిరిపేట గ్రామ పరిధిలోని వాగు ప్రాంతంలో మొసలి పిల్లలు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. వాగు సమీపంలోని పొలంలో భూమి కొలతల పనులు నిర్వహిస్తున్న సమయంలో భూమిలో నుంచి మొసలి పిల్లలు బయటకు వస్తుండటాన్ని గమనించిన కార్మికులు భయాందోళనకు గురై వెంటనే గ్రామ సర్పంచ్ షాబుద్దీన్‌కు సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్ పరిస్థితిని పరిశీలించగా, సుమారు 20 మొసలి పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసలి పిల్లలను స్వాధీనం చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమీపంలోని చెరువు, వాగు ప్రాంతాల్లో మరిన్ని మొసళ్లు లేదా గుడ్లు ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ, అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలనలు నిర్వహించి ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాగు, చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్లే రైతులు, కూలీలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ షాబుద్దీన్ సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Sthanikam

మిలిగిరిపేట వాగు ప్రాంతంలో మొసలి పిల్లల కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News