Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:26 PM

మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు

03-06-2026 308 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మూడోసారి క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్న బాల్కి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రేను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడిగా ఈశ్వర్ ఖండ్రే మరోసారి క్యాబినెట్ హోదా పొందడం గర్వకారణమన్నారు. ప్రజాసేవ, సమాజ అభ్యున్నతి పట్ల ఆయన చూపుతున్న కృషికి గుర్తింపుగానే ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. అలాగే ఈ గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించిన డి.కె. శివకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈశ్వర్ ఖండ్రే తన పదవిలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, వీరశైవ లింగాయత్ సమాజ పురోగతికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాజ రాష్ట్ర నాయకులు సిహెచ్ బసవరాజ్, సులగంటి సిద్ధేశ్వర్, శివరాజ్ పాటిల్, సదాశివపేట అధ్యక్షుడు గందిగా రాజు, జిల్లా యువజన అధ్యక్షుడు బుగ్గన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మూడోసారి క్యాబినెట్ మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రేకు సంగారెడ్డి వీరశైవ నాయకుల అభినందనలు

Article Image

కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మూడోసారి క్యాబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్న బాల్కి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ అధ్యక్షుడు ఈశ్వర్ ఖండ్రేను సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడిగా ఈశ్వర్ ఖండ్రే మరోసారి క్యాబినెట్ హోదా పొందడం గర్వకారణమన్నారు. ప్రజాసేవ, సమాజ అభ్యున్నతి పట్ల ఆయన చూపుతున్న కృషికి గుర్తింపుగానే ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. అలాగే ఈ గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించిన డి.కె. శివకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈశ్వర్ ఖండ్రే తన పదవిలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, వీరశైవ లింగాయత్ సమాజ పురోగతికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ సమాజ రాష్ట్ర నాయకులు సిహెచ్ బసవరాజ్, సులగంటి సిద్ధేశ్వర్, శివరాజ్ పాటిల్, సదాశివపేట అధ్యక్షుడు గందిగా రాజు, జిల్లా యువజన అధ్యక్షుడు బుగ్గన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News