Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

మన వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై మెగా అవగాహన సదస్సు!

09-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వెలిమినేడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10:00 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘రోడ్డు భద్రత అవగాహన గ్రామసభ’ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని, సురక్షిత ప్రయాణం – డ్రైవింగ్ లైసెన్స్ ఆవశ్యకతపై దిశానిర్దేశం చేయనున్నారు.

అందరూ తప్పక పాల్గొనాలి: సర్పంచ్

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు మరియు ఇతర వాహనాల యజమానులు, డ్రైవర్లు, యూనియన్ సభ్యులు ఈ అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమ వివరాలు:

తేదీ: 10-06-2026 (బుధవారం)

సమయం: ఉదయం 10:00 గంటలకు

స్థలం: గ్రామ పంచాయతీ కార్యాలయం, వెలిమినేడు.

ప్రకటన:

మల్లం మహేష్

మాజీ వార్డు సభ్యులు, వెలిమినేడు.

కలిసి వద్దాం.. కదిలి వద్దాం!

గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మరియు ముఖ్యంగా వాహనదారులు (ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు, ఇతర వాహనాల యజమానులు) అందరూ ఈ సభకు హాజరై, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరుచున్నాము.

మన భద్రత - మన బాధ్యత!

Sthanikam

మన వెలిమినేడు గ్రామంలో రోడ్డు భద్రతపై మెగా అవగాహన సదస్సు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News