Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:01 PM

పన్నులు పెంచలేదు..అప్పులు తీరుస్తూనే ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పన్నులు పెంచలేదు..అప్పులు తీరుస్తూనే ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పన్నులు పెంచలేదు..అప్పులు తీరుస్తూనే ‘ఇందిరమ్మ రాజ్యం’ నడిపిస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
June 09, 2026 07:53 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

​రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టినా..వెనకడుగు వేయని ప్రజా ప్రభుత్వం

కనురెప్ప పాటు కరెంట్ పోకుండా 18,546 మెగావాట్ల రికార్డు డిమాండ్ అధిగమించాం

త్వరలోనే కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’

హరీష్ రావు,ప్రతిపక్ష పార్టీల విష ప్రచారాలను తిప్పికొట్టండి!

​భువనగిరిలో రూ. 11 కోట్ల విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గత పాలకుల చేతకానితనం వల్ల రాష్ట్రంపై పడ్డ రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాల్ని మోస్తూ,ఏటా రూ. 76,000 కోట్లు అసలు,వడ్డీలు కడుతూనే.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యాన్ని నడిపిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. భువనగిరి సర్కిల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రజల ఉద్దేశించి డిప్యూటీ సీఎం ప్రసంగించారు. రోజుకో అబద్ధం సృష్టిస్తూ, కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు.గత ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా (ప్రస్తుత ముఖ్యమంత్రి) రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేతగా తాను సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. డిస్కంలను ముంచిన బీఆర్‌ఎస్.. ఆదుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం!

​గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఉచిత కరెంట్ అని ఓట్లు దండుకుందే తప్ప, డిస్కంలకు నిధులు ఇవ్వకుండా అప్పులపాలు చేసిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ​"గత పాలకులు పెట్టిన బకాయిలను క్లియర్ చేస్తూ.. రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ.14,000 కోట్లను మా ఆర్థిక శాఖ ద్వారా ప్రతి నెలా ప్రణాళికాబద్ధంగా డిస్కంలకు చెల్లిస్తున్నాం. ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. 2023-24లో 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటేనే చేతులెత్తేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ,తమ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18,546 మెగావాట్ల రికార్డు స్థాయి పీక్ డిమాండ్ నమోదైనప్పటికీ, కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్తును అందించి ఘనత సాధించిందని కొనియాడారు. హరీష్ రావు వేస్తున్న అభాండాలను ప్రజలంతా గమనిస్తున్నారని,రోజుకో అబద్ధం తో కట్టు కథలల్లి విష ప్రచారం చేస్తున్న వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రూపాయి పన్ను పెంచకుండానే ‘అద్భుత ప్రగతి’..

​గత ప్రభుత్వం దోపిడీకే పరిమితమైతే, తాము ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను భారం వేయకుండానే పాత వనరులతోనే సంక్షేమ విప్లవం తెచ్చామని డిప్యూటీ సీఎం వివరించారు:

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో పాటు వడ్డీ లేని రుణాల కింద కేవలం రెండున్నరేళ్లలోనే రూ. 67,000 కోట్ల రుణాలు అందించాం. భువనగిరి గడ్డ వేదికగా చెబుతున్నాం. ఐదేళ్లలో దీనిని రూ. 1.25 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను రాష్ట్రంలోని మహిళలందరికీ అందిస్తామన్నారు . మహిళా సంఘాల ద్వారానే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో తిప్పేలా విప్లవాత్మక నిర్ణయం ప్రజా ప్రభుత్వం తీసుకున్నదని వివరించారు. రాష్ట్రంలోని కోటి 6 లక్షల పేద కుటుంబాలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రూ.50-55 విలువైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఘనత మాదే. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, కొద్ది రోజుల్లోనే 76,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను క్రమ పద్ధతిలో విడుదల చేస్తున్నాం. ఇకపై దళారీల ప్రమేయం లేకుండా ఈ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాలకే జమ చేయాలని యోచిస్తున్నాం. డబుల్ బెడ్‌రూమ్ పేరిట కేసీఆర్ మోసం.. రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు!

​డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం పేదలను దారుణంగా మోసం చేసిందని, ఆ సొమ్మంతా వారి ఇళ్లకే పోయిందని భట్టి విమర్శించారు. దానికి భిన్నంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతి పేదవానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని,మొదటి విడతలోనే రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించబోతున్నట్లు హామీ ఇచ్చారు. ​కోటి 15 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ కుటుంబ భీమా’

​దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు కులమతాలతీతంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రూ. 5 లక్షల ధీమా కల్పించేలా 'ఇందిరమ్మ కుటుంబ భీమా' పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నామని భట్టి విక్రమార్క ఒక భారీ ప్రకటన చేశారు. సీఎం నుంచి మంత్రుల వరకు రోజుకు 18 గంటలు శ్రమిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. ప్రతిపక్షాల అప్పుల భారం లేకుంటే ఈపాటికి తెలంగాణ దశ,దిశ మారిపోయేదన్నారు. కాగా,బసవపురం భూ నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ,వారికి పరిహారం త్వరగా అందేలా తక్షణ చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) యాదాద్రి భువనగిరి జిల్లా సర్కిల్ పరిధిలో, భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్ పక్కన ₹5.83 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో ₹2.67 కోట్లతో నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఈ సర్కిల్ కార్యాలయం నుంచే రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ అంది లబ్ధి చేకూరుతుంది. భువనగిరి మండలం హనుమపురం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ₹2.03 కోట్లతో నిర్మించనున్న 'స్టోర్ కాంప్లెక్స్'కు,అలాగే వలిగొండ మండలం నర్సాపూర్ గ్రామంలో ₹3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు కరెంట్ సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతన 33/11 సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఇట్టి సబ్ స్టేషన్ లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 5 కోట్ల తోటి నూతన TGSPDCL సర్కిల్ ఆఫీస్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ స్టోరేజ్ గోడౌన్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నందున భువనగిరి లోని స్టోరేజ్ మొత్తం నల్లగొండ స్టోరేజ్ లో చేయాల్సి ఉందన్నే విషయాన్ని గుర్తించి భువనగిరి నియోజకవర్గంలోనే నూతన స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు.దాదాపు 8 సబ్ స్టేషన్ లు త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని,తదనుగుణంగా భువనగిరి లో నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. గత పాలనలో ఒక్క సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయలేదని,ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నూతన సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... రైతులకు అవసరమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు,విద్యుత్ కనెక్షన్లు అందించేలా చూడాలని అన్నారు. నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడం భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక గొప్ప వరం అని అన్నారు. నూతన సబ్ స్టేషన్ ల ద్వారా విద్యుత్ అంతరాయం ఉండదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,టీజిఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్ ఐ.ఏ.ఎస్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి,తడక వెంకటేశం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు,ఇతర ప్రజాప్రతినిధులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News