Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ

10-06-2026 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెం (జనంపల్లి)లో ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ద్వారా 135 మంది రైతుల నుంచి 11,443 క్వింటాళ్ల (28,609 బస్తాలు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 లారీల ద్వారా ధాన్యాన్ని తరలించగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులో కొనుగోళ్లు పూర్తిచేయడం అభినందనీయమన్నారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్‌డీసీఎంఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.

కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు గంగుల వెంకట్‌రెడ్డి, నక్క యాదయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పబ్బు వెంకటేష్, బుక్‌కీపర్ పండుగ నగేష్, ట్యాబ్ ఆపరేటర్ పండుగ కావ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులకు అండగా సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి. లచ్చిరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో 28,609 బస్తాల ధాన్యం సేకరణ

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లచ్చిరెడ్డిగూడెం (జనంపల్లి)లో ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతంగా ముగించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండ సరోజ-అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ద్వారా 135 మంది రైతుల నుంచి 11,443 క్వింటాళ్ల (28,609 బస్తాలు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 32 లారీల ద్వారా ధాన్యాన్ని తరలించగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులో కొనుగోళ్లు పూర్తిచేయడం అభినందనీయమన్నారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్‌డీసీఎంఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.

కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు గంగుల వెంకట్‌రెడ్డి, నక్క యాదయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ పబ్బు వెంకటేష్, బుక్‌కీపర్ పండుగ నగేష్, ట్యాబ్ ఆపరేటర్ పండుగ కావ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News