Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:27 PM

ఇస్నాపూర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: మంత్రి వివేక్‌కు నీలం మధు వినతి

09-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రత్యేకంగా పరిగణించి అభివృద్ధి కోసం అదనపు నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రికి ఇస్నాపూర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికిన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ చిట్కుల్ పరిధిలోని 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలలో అంతర్గత రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, తాగునీటి సౌకర్యం, ఇంటి నెంబర్లు, విద్యుత్ మీటర్లు వంటి మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే నేషనల్ హైవే నుంచి లక్డారం–బ్యాతోల్–రుద్రారం–ఏర్థనూర్ వరకు రహదారి అభివృద్ధితో పాటు ఇరువైపులా ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ.15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు ప్రారంభమైనప్పటికీ, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట శ్రీనివాస్ గౌడ్, నారాయణదాసు, మన్నే రాఘవేందర్, వెంకటేష్ నాయక్, నర్సింహారెడ్డి, గోపాల్, దస్తగిరి, మణికంఠతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఇస్నాపూర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: మంత్రి వివేక్‌కు నీలం మధు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News