Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:27 PM

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య

09-06-2026 726 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, : తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు ఒగ్గు కళాకారుడిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒగ్గు కళాకారుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పూర్తి వివరాలు, హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెంచర్‌లో రక్తపాతం.. ఒగ్గు కళాకారుడిని బండరాయితో మోది హత్య

Article Image

నల్గొండ, : తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు ఒగ్గు కళాకారుడిగా గుర్తింపు పొందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒగ్గు కళాకారుడి హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి పూర్తి వివరాలు, హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News