Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:56 PM

పంతంగిలో అక్రమ మద్యం నిల్వలపై పోలీసుల దాడి: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్, భారీగా మద్యం సీసాల స్వాధీనం

02-06-2026 295 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు, నమ్మదగిన సమాచారం ప్రకారం.. చౌటుప్పల్ ఎస్సై పి. రవీందర్ తన సిబ్బందితో కలిసి మంగళవారం పంతంగి గ్రామ పరిధిలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారు.​స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు:

​1. అంతటి గణేష్ (తండ్రి: జంగయ్య) వద్ద లభించినవి:

​5000 బీర్లు (650ml) – 12

​కేఎఫ్ బీర్లు (650ml) – 2

​కాయ్ కాయ్ (180ml) – 94

​ఓసి (180ml) – 39

​ఐబి (180ml) – 18

​2. కాకి పాండు (తండ్రి: గంగయ్య) వద్ద లభించినవి:

​కేఎఫ్ బీర్లు (650ml) – 14

​కాయ్ కాయ్ (180ml) – 40

​అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న సదరు నిందితులపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నడిపినా, అక్రమంగా మద్యం విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Sthanikam

పంతంగిలో అక్రమ మద్యం నిల్వలపై పోలీసుల దాడి: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్, భారీగా మద్యం సీసాల స్వాధీనం

Article Image

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు, నమ్మదగిన సమాచారం ప్రకారం.. చౌటుప్పల్ ఎస్సై పి. రవీందర్ తన సిబ్బందితో కలిసి మంగళవారం పంతంగి గ్రామ పరిధిలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారు.​స్వాధీనం చేసుకున్న మద్యం వివరాలు:

​1. అంతటి గణేష్ (తండ్రి: జంగయ్య) వద్ద లభించినవి:

​5000 బీర్లు (650ml) – 12

​కేఎఫ్ బీర్లు (650ml) – 2

​కాయ్ కాయ్ (180ml) – 94

​ఓసి (180ml) – 39

​ఐబి (180ml) – 18

​2. కాకి పాండు (తండ్రి: గంగయ్య) వద్ద లభించినవి:

​కేఎఫ్ బీర్లు (650ml) – 14

​కాయ్ కాయ్ (180ml) – 40

​అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న సదరు నిందితులపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నడిపినా, అక్రమంగా మద్యం విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News