Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 PM

బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించిన చిరుమర్తి లింగయ్య

09-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నర్రా శ్రీకాంత్ రెడ్డి ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడగా, ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య, వైద్యుల సూచనలను పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలని కోరిన ఆయన, శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించిన చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News