Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం

01-06-2026 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​రెండోసారి బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పుట్టినరోజున నియామక పత్రం అందజేత

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పంతంగి గ్రామానికి చెందిన బోయ దేవేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన సహకారంతో దేవేందర్ ఈ బాధ్యతలను దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా బోయ దేవేందర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు, సీనియర్ నాయకులు ఆడం సంజీవరెడ్డి, పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని దేవేందర్ స్పష్టం చేశారు.

Sthanikam

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోయ దేవేందర్ ఏకగ్రీవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News