Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:23 AM

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

05-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం డీఈవో సుశీందర్‌రావును కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించలేక కొంతమంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేసే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీలు అమలు చేస్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోనూ కనీసం 75 శాతం రాయితీ కల్పించాలని కోరినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన డీఈవో సుశీందర్‌రావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి జర్నలిస్టుల పిల్లలకు 70 శాతం వరకు ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

వినతిపత్రం అందజేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు పరమేశ్‌, మాదరి యాదగిరి, ఎర్రెడ్ల చంద్రశేఖర్‌రెడ్డి, అబ్బోజు మదనాచారి, గంగాధర వెంకటేశ్వర్లు, వంగాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News