Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 11:45 AM

తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్‌ సభేంటి.?

04-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పవన్ ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తెలంగాణలో విద్వేషాలు వద్దు..

ధాన్యం సేకరణకు కేంద్రం సహకరించడం లేదు..

విలేకరుల తోటి చిట్‌చాట్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించడం సరైన సమయం కాదని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సమకాలీన అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

​గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు..

అమరావతిలోనే పాలకుల నివాసాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రహ్మాండమైన రాజధాని అని చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు చెబుతున్నారని గుత్తా గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉంటూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు వనరులు (సోర్సెస్) చాలా ఎక్కువ ఉన్నాయని, సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు రకరకాల పోర్టులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ నేతలు తమ రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి తప్ప, తెలంగాణ వైపు చూడాల్సిన అవసరం లేదన్నారు.

బాధ్యతాయుతమైన భాష ముఖ్యం..

రాజకీయాల్లో నాయకులు వాడుతున్న భాషా తీరుపై గుత్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న భాషా శైలి సరిగా లేదని, నాయకులు పరస్పరం దూషణలకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హితవు పలికారు. తెలంగాణ సమాజంలో విద్వేషాలు రేకెత్తించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ధాన్యం సేకరణపై మండలి చైర్మన్ సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఆయన వెల్లడించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, అందువల్లే ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు.

రైతులు పంట మార్పిడి వైపు ఆలోచించాలి..

మన రాష్ట్రంలో రైతులు కేవలం వరి, పత్తి పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకే రకమైన పంటలు కాకుండా, రైతాంగం ఇకనైనా పంట మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్) వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Sthanikam

తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్‌ సభేంటి.?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News