Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:52 AM

మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి!

04-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంచేపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ అంజి, పశువులకు గడ్డి తీసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా కరెంటు స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు.

బ్రాహ్మణపల్లి నుంచి మంచేపల్లి వెళ్లే మార్గంలో రాత్రివేళ దట్టమైన చెట్లు, పొదలు రోడ్డును పూర్తిగా కమ్మేయడంతో పాటు వీధి దీపాలు లేకపోవడం ప్రమాదానికి కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారు చీకట్లో దారి కనిపించకపోవడంతో అంజి ప్రయాణిస్తున్న బైక్ నేరుగా కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజిని చికిత్స కోసం తరలించేలోపే ఆయన మృతిచెందారు. అంజి మృతితో మంచేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ఈ రహదారిపై ప్రతిరోజూ రైతులు, కూలీలు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పొదలను తొలగించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News