Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:29 PM

ప్రైవేట్ ఆసుపత్రుల్లో UWIN అమలుకు చర్యలు. డిజిటల్ వ్యాక్సినేషన్ సేవలపై అవగాహన

03-06-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, గర్భిణీలు, చిన్నారులకు అందించే టీకా సేవలను డిజిటల్ విధానంలో నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన UWIN పోర్టల్ వినియోగంపై జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులకు అవగాహన కల్పించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో 52 డెలివరీ పాయింట్లుగా నమోదైన ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇప్పటికే 40 ప్రైవేట్ ఆసుపత్రులు UWIN ఐడీలు పొంది గర్భిణీలు, నవజాత శిశువుల వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఆసుపత్రులు కూడా వెంటనే పోర్టల్‌లో నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

UWIN ద్వారా గర్భిణీల నమోదు, ప్రసవ వివరాలు, నవజాత శిశువుల నమోదు, జనన నివేదికలు, టీకాల నమోదు, తదుపరి టీకాల ట్రాకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. టీకా సేవలకు సంబంధించిన సమాచారం, తదుపరి టీకాల తేదీలు ఎస్‌ఎంఎస్ ద్వారా అందడంతో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, రికార్డులు డిజిటల్ రూపంలో పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, UWIN పోర్టల్ పరిశీలకులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ ఆసుపత్రుల్లో UWIN అమలుకు చర్యలు. డిజిటల్ వ్యాక్సినేషన్ సేవలపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News