Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం
27-05-2026 371 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో రైతు సామ జగన్మోహన్‌రెడ్డికి భారీ నష్టం

లక్షల్లో ఆస్తినష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతు

రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రైతు సామ జగన్మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న కోళ్ల ఫారం అర్ధరాత్రి వచ్చిన గాలిదుమారానికి పూర్తిగా నేలమట్టమైంది. ఒక్కసారిగా షెడ్లు కూలిపోవడంతో ఫారంలోని పరికరాలు, ఫీడ్ సామగ్రి ధ్వంసమై రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.గాలి వేగానికి టిన్‌షీట్లు ఎగిరిపోవడంతో పాటు ఫారం నిర్మాణం మొత్తం కుప్పకూలిపోయింది.

ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు పరిస్థితిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవలే అప్పులు చేసి ఫారాన్ని అభివృద్ధి చేసుకున్న జగన్మోహన్‌రెడ్డి, జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

“ఏళ్ల తరబడి కష్టపడి ఏర్పాటుచేసుకున్న ఫారం క్షణాల్లో నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి” అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Sthanikam

ఈదురుగాలికి కుప్పకూలిన కోళ్ల ఫారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News